News

రాజయ్య టి్ఆర్ఎస్‌ను వీడే దైర్యం చేస్తారా


మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య కాంగ్రెస్ లో చేరవచ్చని కధనాలు వస్తున్నాయి. కొన్ని పత్రికలలో ఈ విషయమై వార్తలు ఇస్తూ , గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రాజయ్య కాంగ్రెస్ లో చేరి వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీచేయవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టడానికి ఈ ప్రయత్నం చేయవచ్చు.అయితే నిజంగా రాజయ్య టిఆర్ఎస్ ను వీడే దైర్యం చేస్తారా?అన్నది చర్చనీయాంశం. టిఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకుని కెసిఆర్ పై రాజకీయ పోరాటానికి సిద్దపడితే ఫర్వాలేదు కాని, లేకుంటే అంత తొందరగా పార్టీ మారతారా అన్నది సందేహం.వరంగల్ లో కాంగ్రెస్ తరపున పోటీచేస్తే గెలుస్తామన్న నమ్మకం కలిగితే చెప్పలేం.మామూలుగా అయితే రాజయ్య అంత శక్తిమంతుడు కాదు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న రాజయ్య అప్పట్లో వచ్చిన విబేదాల రీత్యా టిఆర్ఎస్ లోకి వచ్చారు.అనూహ్యంగా కెసిఆర్ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రాజయ్య రిస్క్ చేస్తారా అన్నది చూడాలి.